శివాలయంలో  పెట్రోల్​ తో దీపారాధన.. పూజారికి గాయాలు... ఎక్కడంటే

కార్తీకమాసం సందర్భంగా దేశవ్యాప్తంగా శివాలయాలు కిటకిటలాడుతున్నాయి.  భక్తులు దీపాలు వెలిగిస్తూ.. హరహర మహాదేవ శంభోశంకర అంటూ భజనలు చేస్తున్నారు.  కార్తీకదీపాలు వెలిగించేందుకు సాధరణంగా ఆవునెయ్యిగాని.. నువ్వులనూనె గాని ఉపయోగిస్తారు.  కాని ఓ దేవాలయంలో అర్చక స్వామి దీపారాధనకు పెట్రోల్​ ఉపయోగించాడు.  అదెక్కడో కాదు.. మన తెలంగాణ..  నల్లగొండ జిల్లాలోనే.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నల్లగొండ జిల్లా నకిరేకల్​ శివాలయంలో అపశృతి చోటు చేసుకుంది.  అర్చకస్వాములుగర్భగుడిలో దీపారాధన చేయగా  ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆలయ పూజారి దీక్షితులకు గాయాలయ్యాయి.. దీపారాధనకు నువ్వుల నూనె లేదా ఆవునెయ్యికు బదులుగా పెట్రోల్​ ఉపయోగించాడు.  దీంతో మంటలు చెలరేగి గర్భగుడిలో పొగ అలముకుంది. శివాలయం అర్చకులకు గాయాలు కాగా.. నకిరేకల్​ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు.  గర్భగుడిని శుభ్రం చేసేందుకు పెట్రోల్​ తీసుకువచ్చాడని సమాచారం అందుతుంది.